బుధవారం 15 ఫిబ్రవరి 2012

ఎడారివర్షం బృందానికి అభినందనలు !!!

కేరళ ఫిలిం ఫెస్టివల్‌ లో ప్రదర్శించబడడానికి ఎడారి వర్షం సినిమా ఎంపికయింది అని తెలిసి చాలా సంతొషిస్తున్నాను. ఆ సినిమా నేను చూడలేదు కానీ, ఆ సినిమా దర్శకుడు మన సాటి బ్లాగరు "కత్తి మహేష్‌" కి నా అభినందనలు. మహా మహా దర్శకులే చేయలేని పనిని కేవలం కొంతమంది ఔత్సాహికులు చేయగలగడం అంటే మామూలు విషయం కాదు.

సినిమామీద, వ్యాపారం మీద ఆసక్తి ప్రతీ ఒక్కడికీ ఉంటుంది. కానీ వాటిలో తలబడి గెలవడం చాలా కొద్దిమందికే సాధ్యం. నిజంగా చేసి చూపించిన ఎడారివర్షం ఔత్సాహిక బృందానికి అభినందనలు ..కుడోస్‌, అప్లాడ్స్‌, చప్పట్లు ..

కత్తి అన్నాయ్‌, మీద నాకు ఎప్పుడూ ఒక నమ్మకం ఉంటుంది. అన్నాయ్‌ వాదనలతో నేను ఏకిభవిస్తానా లేదా అన్న విషయం పక్కనపెడితే, నమ్మిన సిద్ధాంతాలమీద పట్టుతో, సంకల్పంతో, మంచి విషయపరిఙ్ఞానంతో అన్నాయ్‌ చేసే వాదనలు నాకు చాలా ముచ్చటగొల్పుతాయి.

మన ఆసక్తులమీద ఫోకస్‌ కోల్ఫొకుండా లక్ష్యం మీద దృష్టిపెట్టి ముందుకుపోతే ఎలా గెలవగలమో అద్భుతంగా ఋజువు చేశావు. నీ కృషి కి హేట్స్‌ ఆఫ్‌...... హైల్‌ యూ .. హైల్‌ యూ మేట్‌ .. కీప్‌ ఇట్‌ అప్‌..

16 వ్యాఖ్యలు:

  1. ఎడారి వర్షం సినిమా డైరెక్టర్ కత్తి గారా? నేను చాలా రోజులుగా ఆయన బ్లాగ్ చూడలేదు. అందుకే నాకు తెలియలేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. surprisingly not many blogs around this topic. That shows how the world is biased

    ప్రత్యుత్తరంతొలగించు
  3. కత్తి గారిని వ్యక్తిగతంగా ద్వేషించేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు కదా. అందుకే ఆయన దర్శకత్వం వహించిన సినిమా గురించి చర్చించడం లేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. Welldone. Congratulations and best wishes to Mahesh and the entire team.

    Its good to see one of our bloggers deliver somework in his feild of interest.

    btw, I saw the movie and gave my feedback to Mahesh :)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. ఈ విషయం ఇప్పటివరకూ బ్లాగుల్లో చర్చించబడకపోవడం అనేది దాఋణం. ఇంత మంచి విషయాని వెలుగులోకి తెచ్చిన బ్లాగుబాబ్జీకి మనస్పూర్తిగా అభినందనలు.
    ఇది దేనికి నిదర్శనం, అసూయా, ద్వేషమా? వివక్షతా?

    ప్రత్యుత్తరంతొలగించు
  6. ఇది బయాసూ కాదు, అసూయా కాదు, వివక్షాకాదు, గాడిదగుడ్డూకాదు. పేధ్ధ వీరోలు లేని సినిమాలని పట్టించుకోని స్థితికి మనం ఎగబాకామని(??) దీనర్ధం. అంతే.

    మహేష్ గారికి మరియు బృంద సభ్యులకు అబినందనలు. వారు ఇలాగే పనికొచ్చే సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. నిమ్మ కాయ తొక్కు, చింత కాయ పచ్చడి సొంత కవిత్వం అంటూ
    సొంత పైత్యం తో హింసించే టపాలకు వందలు వందలు కామెంట్లు వుంటాయి..
    మరి ఇంత మంచి ప్రయోగం చేసిన తోటి బ్లాగర్ గురించి కనీసం
    చిన్న పాటి స్పందన కూడా లేకపోవటం శోచనీయమే కదా!
    ఎడారివర్షం బృందానికి అభినందనలు !!!

    ప్రత్యుత్తరంతొలగించు
  9. ఎడారిలో వర్షమా? చూడలేదు, కథ వినలేదు. చూడకుండా కామెంట్లు రాసే చెడ్డలవాటు లేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. Vaanni janalu pattinchukovadam manesi o rendellayindi

    ప్రత్యుత్తరంతొలగించు
  11. నా బ్లాగు ఫలానా పత్రికలో పడింది, లేచింది అనో ఈరోజుతో 31536000 సెకన్లు పూర్తి చేసుకుంది అనో రాస్తే తప్ప కామెంట్లు రావు.

    >>ఇది బయాసూ కాదు, అసూయా కాదు, వివక్షాకాదు, గాడిదగుడ్డూకాదు. పేధ్ధ వీరోలు లేని సినిమాలని పట్టించుకోని స్థితికి మనం ఎగబాకామని(??) దీనర్ధం. అంతే.

    మినర్వా గారూ, చిన్న కరక్షన్ మీ కామెంటు కి,"పెద్ద ఫాలోయింగు లేని(?) బ్లాగర్లు" అని రాయడం కరస్ట్ అనిపించింది నాకు వీరోల స్థానం లో. జస్ట్ నా అభిప్రాయం అంతే సుమా...

    ప్రత్యుత్తరంతొలగించు
  12. కానీ ఇది చాలా అన్యాయం, అంత పెద్ద అచీవ్‌ మెంటుకి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అభినందనలు తెలపకపోవడం. అదే ఒక ప్రబుద్ధుడు వచ్చీ రాని కీబోర్డు మీద వాణ్ణీ వీణ్ణీ టార్గెట్‌ చేస్తూ లల్లాయిపదాలు పాడితే కామెంట్లతో రెచ్చిపోతారు.

    బ్లాగు వాతావరణం ఎంతగా పర్వర్టులతో నిండిపోయిందో తెలపడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటిలేదు.

    ఇంక తెలుగు బ్లాగులని ఆదేముడే రక్షించాలి.

    ప్రత్యుత్తరంతొలగించు
  13. బాబ్జీ నువ్వో విషయం అర్ధం చేసుకోవాలి. అతను తప్పించి ఈ ప్లేసులో ఎవడున్నా చివరికి మన ప్రవీణ్‌ ఉన్నా .. అభినందనలు చెప్పాలనిపించేది.

    ఎంతసేపూ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుందామనో మరోటో మరోటో ఆలోచించేవాళ్లకి అభినందనలు ఆశించే హక్కులేదు. తను ఏనాడైనా ఎవణ్ణైనా అభినందించాడా?

    ప్రత్యుత్తరంతొలగించు
  14. Please.... this is getting too much and you guys are over stretching and over analyzing a simple thing.. Get get a move on.

    If you like it or think you want to congratulate, go ahead and do it.

    The atmosphere in blogs, bias, presence of perverts, personal characterstics of Mahesh or other bloggers these are completely out of the place here in my opinion. Some of your observations may be worth discussing but they are separate topics.

    ప్రత్యుత్తరంతొలగించు
  15. ఓ తొక్కలో షార్టు ఫిల్మూ ఎవడూ వెళ్ళని తొక్కలో ఫెస్టివలూ దానికి ఈ చెంచాగాళ్ళ వాయింపుడు బాగుంది. పైన ఎవరో చెప్పినట్టు ఈ తొక్కలో సినిమాకన్నా లొల్లాయి పదాలే ఎంటర్టెయిన్ చేస్తున్నప్పుడు అదే మంచిది కదా.

    ప్రత్యుత్తరంతొలగించు