ఆదివారం 27 నవంబర్ 2011

ప్రపంచంలో ఎవరిమీదా పరిమితిలేని ప్రేమలు పెంచుకోకూడదు ..

స్వభావానికి విరుద్ధంగా ఇవాళ నాకో విషయం చెప్పాలనిపిస్తోంది.

ప్రపంచంలో ఎవరిమీదా ప్రేమలు పెంచుకోకూడదు. తల్లిదండ్రులమీదనైనా, పిల్లలమీదైనా, గర్ల్‌ ఫ్రెండులమీదైనా ..

వాళ్ళు మనజీవితంలోకి వచ్చాకా మనమున్నాము, వెళ్ళిపోయాకా ఉంటాము. ఈ మధ్యలో ఏదో వాళ్ళులేకపోతే జీవితమేలేదనుకుని జనాలు ఎందుకు వాళ్ళవెనకాలే వెళ్ళిపోతారో నాకు అర్ధం కాదు.

అలాగని అందర్నీ భవబంధాలకి దూరంగా ఈ బలాగు బాబ్జీగాడిలాగా బతకమని కాదు. కొన్ని బంధాలు అంతే అవిలేకపోతే మనం లేము అనిపిస్తాయి, మా గురువుగారు చెప్పేవాళ్ళు. మనకి క్రితం జన్మలో ఋణం ఉంటే ఈజన్మలో కలుస్తాం, ఆ ఋణం తీరిపోయాక విడిపోతాము. ఆపేశక్తిలేదు ఎవరికీ లేదంట. అలాంటిది ఏమన్నా మీకు ఉంటే వెంటనే దాన్నించి దూరం జరగండి. తరవాత ఇబ్బంది పడతారు.

బ్రమ్మ రాసిన రాతలకి ఎదురు రాయాలనుకోవడం మూర్ఖత్వం బాస్ . మనుషుల్లో పెరుగుతున్న ఈ మూర్ఖత్వం నాకు భయం కలిగిస్తోంది. చదువుకున్నవాళ్ళుకూడా .. అంత మూర్ఖంగా .. ఏంటో ..ప్చ్

అందుకే ఇలాంటి కష్టపరిస్థితులకి ఎదురీది బతకడం ఎలాగ అన్నదానికోసం నా అంతట నేనుగా ఒక ఫార్ములా తయారు చేసుకున్నా .. అది నా వ్యక్తిగతం అయినా దానివల్ల పదిమందికి ఉపయోగం కలుగుతుంది అని నాకు అనిపిస్తోంది.
అఫ్కోర్స్ అదేమీ అంత గొప్పవిషయం కాదనుకో .. చాగంటి మాస్టారు ప్రవచనాలు విన్నవాళ్ళకెవరికైనా తెలిసిపోతుంది.

అదేంటో తర్వాతచెప్తా ..

2 వ్యాఖ్యలు: