ఆదివారం 13 నవంబర్ 2011

'రింగులో కింగు' ఫిషరు.

కింగుఫిషరు నష్టాల్లో ఉందంట !! గోరుమెంటు ఆదుకోవాలంట !!

విజయ్‌ మాల్యా గారి సుపుత్రుడు సిద్ధార్ద్‌ మాల్యాగారు దీపికాపడుకునే పాపకి పైడ్‌ డేటింగుకింద ఇచ్చుకున్న మొత్తం బయటకి తీస్తే కింగుఫిషరు పైలెట్లకి జీతాలు సంవచ్చరానికి సరిపోతాయి.

బెంగుళూరు విట్టల్‌ మాల్యా రోడ్దులోని అయ్యగారి ఇంటికీ రోడ్డుకీ మద్యున్న స్థలాన్ని BMC వాళ్ళకిస్తే ఓ రెండేళ్ళదాకా కింగుఫిషరు యిమానాలకి పెట్రోలుకు ఢోకా ఉండదు.

ఇంకా చాలకపోతే .. కస్తూర్బా రోడ్డుపక్కన విజయ్‌ మాల్యాగారి ది గ్రేట్‌ యూబీ సిటీ మాల్‌ లోని ఒక్క ఫేస్‌ అమ్ముకోమను చాలు.. పదేళ్ళు కింగునీ, ఫిషరునీ, కింగుగారి సేతి రింగునీ పువ్వుల్లో పెట్టుకుని కాపాడుకోవచ్చు.

అంతేకానీ కష్టపడి శెమటోడ్చి సంపాదించి కట్టుకున్న ఆదాయపుపన్నుల్నీ, ముక్కులునుండీ మక్కెలదాకా పిండి వసూలు జేసిన వాట్‌ పన్నుల్నీ ఇట్టాంటి పోరంబోకు పనులకి తగలేస్తానంటే ఒప్పుకునేది లేదు.

13 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 12, 2011 11:48 PM

    ఇల్లలక్కానె పండక్కాదమ్మా..in front crocodile festival

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతNov 13, 2011 07:01 AM

    కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్సుకి మంజురుగా అవసరం లేదు గానీ వడ్డీ లేని ఋణంగా కొంత మొత్తం ఇవ్వొచ్చు. తప్పులేదు. ఇది పోరంబోకు పని కాదు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాల్ని కాపాడడం కోసం, దేశంలోని ఎయిర్ కనెక్టివిటీని నిలబెట్టడం కోసం తప్పదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్సుకి మంజురుగా అవసరం లేదు గానీ వడ్డీ లేని ఋణంగా కొంత మొత్తం ఇవ్వొచ్చు. తప్పులేదు. ఇది పోరంబోకు పని కాదు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాల్ని కాపాడడం కోసం, దేశంలోని ఎయిర్ కనెక్టివిటీని నిలబెట్టడం కోసం తప్పదు
    --------------------------
    నాకు అంత జనాలని దేబిరించాల్సిన అవసరం కనిపించడం లేదు. ఏం మామూలు వైభోగమా ఏంది విజయ్‌ మాల్యాది. ఓ సారి బెంగుళూరు వచ్చి యూబీ సిటీ కి పోయి చూడాలన్నా.. మనబోటోళ్ళు కొనగలిగేది ఒక్కటంటే ఒక్కటి దొరకదు అక్కడ. ఎటు చూసిన సంపద, రిచ్‌, షోయింగు పైగా అన్నయ్య ఇప్పుడు రాజ్యసభ ఎం పీ కూడాను.
    ఎంత వరకు నిజమో నాకైతే తెల్వదుగాని, యూబీ సిటీ మూడో అంతస్తులో .. ఒక యాంఫీ థియేటరు ఉంటుంది దానిపక్కనే ఒక ఫౌంటైన్‌ ఉంటుంది. యూబీ సిటీ మొదలుపెట్టిన రోజున ఆ ఫౌంటైన్‌ లో .. నీళ్ళకి బదులు కింగ్‌ ఫిషర్‌ బీరు పొంగి పారిందంట.
    అన్నయ్య లైఫ్‌ స్టైల్‌ చూస్తే దిమ్మ తిరిగిద్ది, ఒక్క రోజుకి ఖర్చు పెట్టే మొత్తంతో ఒక్క నెలజీతాలు ఇచ్చుకోవచ్చు.
    ఇంక ఎయిర్‌ కనెక్టివిటీ విషయానికొస్తే .. మనోడు ప్రీమియం ఫ్లయింగు ఎక్స్పీరియన్సు కోసం కింగు ఫిషరు ఎయిర్‌ లైన్స్‌ పెట్టినప్పుడు, దానికి కట్టుబడి ఉండచ్చుకదా? కెప్టెన్‌ గోపీనాధ్‌ ఎలా వదిలించుకుందామా అని చూస్తున్న ఎయిర్‌ డక్కన్‌ కొన్నాడు, దాన్ని కింగ్‌ ఫిషర్‌ రెడ్‌ అని రీ బ్రాండింగ్‌ చేశాడు, చెప్తే నమ్మరు గాని, ఈ హై కాస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌, ఆ లో కాస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ మెర్జెర్‌ సఫలం అవ్వదు అని నేను అప్పుడే చెప్పా మా పిల్లకాయలకి.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. చెప్పు దెబ్బలు పూలదండలు కిష్టయ్యా .. బోళ్లన్ని థాంకులు

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అజ్ఞాతNov 13, 2011 10:10 PM

    కింగ్ ఫిషరు నష్టాలన్నీ అబద్ధాలని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. చాలా వ్యాపార సంస్థలు చేసే చీటింగే ఇది. వాడికి ఒక్క పైసా ఇచ్చినా జనాన్ని మోసం చేసినట్టే.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అజ్ఞాతNov 15, 2011 10:37 PM

    మీ ఆలోచనాధోరణిలో లోపం ఉంది. ఇది మధ్యతరగతి అలోచనాధోరణి. కంపెనీ వేరు. వ్యక్తిగత ఆస్తులు వేరు. వ్యక్తిగత ఆస్తులమ్మి కంపెనీలు రన్ చేయడం Business principle కాదు. అలాగే Business డబ్బుని కుటుంబం కోసం వాడడాన్ని కూడా Business principles ఒప్పుకోవు. చట్టప్రకారం కంపెనీ అనేది ఒక ప్రత్యేక వ్యక్తి. ఒక కంపెనీకి చెందిన డబ్బు తీసుకెళ్ళి (అదే గ్రూప్ కి చెందిందనే కారణం చేత) ఇంకో కంపెనీలో పెట్టడం కూడా తప్పే. సత్యం రాజు జైలుకెళ్ళాల్సొచ్చింది ఈ తప్పు చేసి కదా ? మీరనుకుంటున్నట్లు కింగ్ ఫిషర్ హైకాస్ట్ ఎయిర్‌లైనర్ కాదు. అదే నిజమైతే ఇంత నష్టాలొచ్చేవి కావు. ప్రభుత్వ ఎయిర్‌లైనర్లు ఆపరేట్ చేయని అనేక టౌన్లకి కింగ్ ఫిషర్ విమానాల్ని ఆపరేట్ చేసి ఇండియా ఎయిర్ కనెక్టివిటీని అమెరికా స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఈ క్రమంలో తానే నష్టపోవాల్సి వచ్చింది.

    క్యాపిటలిస్టులందరినీ నిష్కారణంగా ద్వేషించడం అలవాటు చేసుకోవద్దు.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. ఇంతబాగా రాసినప్పుడు నీపేరు పెట్టిరాయచ్చుగా అన్నాయ్‌. ఈ కాపిటలిస్టుల గోలేందో నాకు తెలవదు, నా బుర్రకి ఈ ఇజాలూ, ఇస్టులూ అర్ధంగావులే.
    మంచి విషయాలు లేవనెత్తారు, పనుండి బయటకిపోతున్నా .. నా బుర్రకి తట్టినంతలో వివరంగా సమాధానం చెపుతా ..

    ప్రత్యుత్తరంతొలగించు
  8. personal assets? from where? are they not from business???
    just for curiosity ;)

    ప్రత్యుత్తరంతొలగించు
  9. అజ్ఞాతDec 3, 2011 05:15 AM

    బ్రాహ్మణులకి దర్జాలెక్కువ. Vijay Mallya and his son are no exception.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. అజ్ఞాతDec 4, 2011 07:57 PM

    ఆ కేటగరీ ఇండస్ట్రియలిస్టులంతా ఇంత దర్జాగా బతుకుతున్నట్లు కనిపించదు. ఈయనొక్కడే కాస్త స్పెషలు. TVS, The Hindu, Karvy, Infosys అధిపతులంతా relatively simple గానే బతుకుతున్నట్లు కనిపిస్తుంది.

    నాకర్థం కానిదొకటే - Rs.60,000 కోట్ల వ్యాపారసామ్రాజ్యానికి అధిపతి అయిన విజయ్ మల్యా కి జస్ట్ కొద్దివందలకోట్ల దగ్గర సిల్లీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏంటా అని ?

    ప్రత్యుత్తరంతొలగించు