ఆదివారం 6 నవంబర్ 2011

బెంగుళూరు జీవితం-1

ఎందుకో తెల్వదుగానీ బెంగుళూరు అంటే నాకదో పెద్ద ఫీలింగు బాసు. బహుశా మనకి ఉజ్జోగం వచ్చాక ఇండియాలో ఉంటే బెంగుళూరులో తప్ప ఇంకెక్కడా లేకపోవడం మూలాన కాబొలు,

బెంగుళూరుని సౌత్‌ ఇండియా రాజధాని అని కళ్ళుమూసుకుని చెప్పేయచ్చు, ఎందుకంటే ఇక్కడ సౌతిండియాలో అన్ని జాతులూ పొలోమని గనిపిస్తాయి. ఇంత ఎక్కువమోతాదులో సౌత్‌ ఇండియా జనాలూ, వాళ్ళ భాషలూ, అలవాట్లూ ఇంతగా కలగాపులగం అయిపోయింది మన బెంగళూరులో కనిపించినంతగా ఎక్కడా కనిపీదు. బెంగుళూరు సాఫ్ట్‌ వేరు ఆఫిసుల్లో - సాఫ్ట్‌ వేరు డెవలప్‌ మెంట్‌ టీముల్లో తెలుగోళ్ళు ఎక్కువ, టీం లీడుల్లో మళయాళీలు ఎక్కువ, ఫైనాన్సు, హెచ్‌ ఆర్‌ లాంటి సపోర్ట్‌ సర్విసుల్లో కన్నడిగులు ఎక్కువ, మానేజిమెంట్‌ టీములు మొత్తం తమిళ్‌ బ్రామ్మలు (అయ్యర్లూ అయ్యంగార్లూ) --
అంతేకాదు .. చాలా ఆశ్చర్యంగా

టిఫిను హోటల్స్‌ (బెంగళూరులో సాగర్లు అనిపిలుచుకుంటా ఉంటారు) అన్నీ ఉడిపి, మాంగళూరు లోని కెనరా కన్నడిగాలు, బార్బరు షాపులు మొత్తం మన తెలుగోళ్ళు, పచారీ షాపులన్నీ కట్టగట్టుకుని మళయాళీలు,
టీవీ పెడితే అన్నిరకాల భాషల్లోనో సినిమాలు వస్తుంటాయి, ఫోరం మాల్‌ కెళ్ళి పీవీఆర్‌ లో సినిమా చూద్దామంటే తెలుగు, తమిళ్‌, మళయాళం లో ఒక్కొభాషలోనో ఒక్కో సినిమా కనీసం ఉంటుంది. మన సినిమా టికట్టు 250 రూపాయిలుంటే కన్నడ సినిమాకి 170, ఉంటుంది .. సిత్రం ఏటంటే టికట్టు అంత తక్కువున్నా చూడ్డానికి ఎవడూ ఉండడు. కి కి కి కి ..

5 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 5, 2011 01:56 PM

    కి కి కి కి ..
    ఇంతకీ విషయమేటి బాసు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. వెరసి చౌ చౌ బాత్ బై టూ కాఫీ అని చెప్పండి
    ఇంకా విశదీకరించాలంటే రేడీయో మిర్చి నమ్మ మెట్రో సెట్ దోసా !

    ప్రత్యుత్తరంతొలగించు
  3. రేడియోమిర్చీ 98.3 ఇదు సక్కాత్‌ హాట్‌ మగా .. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  4. బీటీఎం లే ఔట్‌ తర తుంబా ట్రాఫిక్‌ జామాగిదె, స్వల్ప నొడ్‌ కుండిదె డ్రైవ్‌ మాడి ..
    నమ్మ బెంగలూరు స్మెల్లే డిఫ్ఫెరెంట్‌ అప్పా.. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. నేను కూడా ఒక శాతము కన్నడిగుడనే. ఒక శాతము అంటే ఒక మాట అని అర్ధము . అది చాలు నేను బెంగళూరు లో బ్రతకడానికి .
    అది ఊటు తయారుదా. ఏమి ఇది చాలదా మన కడుపు నింపుకోవడానికి.

    ప్రత్యుత్తరంతొలగించు