శనివారం 15 అక్టోబర్ 2011

కంచె ఐలయ్య ...మంచిగ చెప్పినవయ్య...-- Part 1

తెలంగాణ ఉజ్జమంలో సరికొత్త కోణం, నాకయితే ఇంతకతుందని ఇప్పటిదాకా తెలీదు .. పట్టిపట్టి చదివితే చాలా విషయాలున్నాయ్. నాకు ఇంకా పూర్తిగా అర్ధం కాలా, మొత్తం చదివి ముందు నేను అర్ధం చేసుకుని నా మాటల్తో మీ బుర్రల్లో దింపుతా .... ఇది మొదటి భాగం.

ఆయన చెప్పిందాంట్లో నా అడివిబుర్రకెక్కిందేమిటంటే .........

చిన్న రాష్ట్రాల మూలంగా దళిత బహుజన వర్గాలకి ఒరిగేదేమీ ఉండదు. కావాలంటే చూడండి, చిన్న రాష్ట్రమైన గోవాలో లేదు, సిక్కింలో లేదు, కేరళలో లేదు, కానీ పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బహుజన ప్రభుత్వం ఏర్పడింది.


చిన్న రాష్ట్రాల్లో కులసమీకరణకాలు పెద్ద రాష్ట్రాల్లోకన్నా క్లిష్టంగా ఉంటాయి. పెద్దరాష్ట్రాల్లో అగ్రకులాల మధ్య ఏరకంగా అధికారమార్పిడి జరిగిందో అదే రకంగా తెలంగాణాలో రేపు కొత్తగా పుట్టుకొచ్చే కులాలమధ్య అధికార మార్పిడి జరుగుతుంది.


ఈ వుజ్జమానికి మావోయిస్టు మద్దత్తు వెనకాల కులసమీకరణాలున్నాయి. ఆర్ ఎస్ ఎస్, మావోయిస్టులు, కలెక్షన్ కాపిటల్ లాంటి టీ ఆర్ ఎస్ పార్టీ వెనకాలున్న కులవర్గాలన్నీ తెలంగాణ అనే కామన్ గోల్ కోసం చాలా సమిష్టిగా కృషిచేస్తున్నాయి.


ఆ మధ్యకాలంలో తెలంగాణలో కొత్తగా రెడ్డీ కాంగ్రెస్ రాబోతోంది అని ఇండియా టైంస్ లో ఓ వ్యాసం చదివాం, అది నిజమవ్వడానికి చాలా గట్టి అవకాశాలున్నాయి. అయితే అది ఇంకా చాలా పెద్ద టాపిక్ కావడం మూలాన వివరాలేమీ ఇప్పుడు చెప్పను.


తెలంగాణ వుజ్జమానికీ అన్నా హజారే దీక్షకీ ఓ లింకుంది అదేంటో తర్వాతి టపాల్లో చెబుతా

కాబట్టి తెలంగాణ సోదరులారా?

ఇవాళ తెలంగాణ వచ్చేస్తే రేపు మాదే అధికారం అన్న భ్రమలో ఉండకండి. మావోయిస్టులు, ఆర్ ఎస్ ఎస్ కేంద్రంలో బీజేపీ మద్దత్తుతో మన ముక్కుదొర కుటుంబం కనీసం 10-15 సంవత్సరాలు తెలంగాణని ఏలడానికి కావలసిన పునాదులూ పెట్టుబడులూ సమకూరిపోయినాయి అక్కడ.


ఆత్మగౌరవం, స్వయంపాలన, సెంటిమెంటు ఇవన్నీ ఉత్తుత్తిమాటలు, మీరు కష్టాలుపడి, చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, రైళ్ళు ఆపి, సమ్మెలు చేసి, జైలుకెళ్ళీ, చిప్పకూడు తిని ఇంతా కష్టపడి పీకేదేమిటంటే - ముక్కుదొరచేతికి అధికారం ఇవ్వటానికి తప్ప మరింకేదీ కాదు.


ఎవడో అధికార కాంక్షతో చేసే చేష్టలకి పడిపోకండి, కూసే కూతలకి లొంగిపోకండి. మీ రక్తాన్ని పణంగా పెట్టి మీ భావితరాల జీవితాల్ని 40 యేళ్ల ముందు వదిలిచ్చుకున్న దొరచేతిలో మళ్ళా పెట్టకండి.


ముందు నేను చస్తా నేను చస్తా అంటారు కానీ ఎవ్వడూ చావడు, ఆ మాట విని మీరు చావబాకండి, మేం చస్తున్నాం కాబట్టి మీరుపోండిరో అని మమ్మల్ని చంపబాకండి..


ఇంకా ఉండాది ఎటూ పోబాకండి.

4 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతOct 15, 2011 02:28 AM

    బాగా చెప్పారు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతOct 15, 2011 02:46 AM

    ఎంత అన్యాయంగా రాస్తున్నారు!
    ఎంత దారుణమైన కామెంట్లు...!!
    తెలంగాణా విద్యార్ధుల చదువులు దెబ్బ తింటున్నాయని మొసలి కన్నీరు కారుస్తున్నది మీరే!
    తెలంగాణా ఉద్యమం మీద, ప్రజల మీదా ఏమాత్రం సంస్కారం లేకుండా అవాకులూ చెవాకులూ పేలుతున్నదీ మీరే!!
    తెలంగాణా అస్తిత్వ పోరాటం అంటే మీకు ఎంత చులకన !!!
    అయినా తెలంగాణా మీద శాస్వతంగా పెత్తనం చేయాలనే ఇంకా మీ దురాశ.
    ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా వుండదు.

    కానివ్వండి ..
    మీ ముఖ్య మంత్రి
    మీ స్పీకర్,
    మీ డీ జీ పీ ,
    మీ సెక్రటేరియట్ ..... మీకు అడ్డేమిటి
    ఈ అన్యాయం ఇంకా ఎంతో కాలం సాగదు గాక సాగదు.

    ఇప్పటికే మీ రాతలను, మీ వెకిలి విమర్శలను తెలంగాణా ప్రజలు పట్టించుకోవడం మానేశారు.
    మీ ఇష్ట మోచ్చినట్టు ....
    తెలంగాణా వచ్చేంత వరకూ ...........!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతOct 15, 2011 04:43 AM

    గీతారెడ్డి, జైపాల్రెడ్డి, జానారెడ్డి, సబితారెడ్డి, పొన్నాల కూడా మీవోల్లే
    మావోల్లెవరూ లేరు, కెసిఆర్, కోదడ్రం, హరీసు, కెటిఆర్ మావోల్లు
    కానీండి, కానీండి మేము ఏడుస్తూనే వుంటాము, మాగ్గావాలె అంతే
    మీ ఇష్ట మోచ్చినట్టు ....
    తెలంగాణా వచ్చేంత వరకూ ...........!

    ప్రత్యుత్తరంతొలగించు