ఆదివారం 2 అక్టోబర్ 2011

ఇంత దారుణమా? !!! సమైక్యవాదుల్లారా మేల్కోండి .. !!!!

వార్నీ .. ముక్కాయన .. ఇంత దారుణమా? ఇన్ని వేషాలా? ఇన్ని నాటకాలా?


రాష్ట్రంలో నేమో నాలుకలు కోస్తాం, చీరేస్తాం? పాతరేస్తాం అని వెర్రికేకలా.. ఉద్యమకారుల ముసుగులో దాడులకి తెగబడ్డమా? బస్సులని తగలబెట్టడమా?

పొద్దుగూకేసరికి గాంధీ టోపీలుపెట్టుకుని ఢిల్లీ రాజ్‌ ఘాట్‌ లో నేషనల్‌ మీడియా ముందు శాంతియుతంగా పోరాడుతున్నామని చిలకపలుకులా?

ఇది అబద్ధం దారుణం, అన్యాయం అక్రమం. తెలంగాణ ఉద్యమం మీద మిగతా జాతీయ పార్టీల్లో సానుభూతి పెంచడం కోసం మనోణ్ణి ఢిల్లీ పిలిపించి కాంగ్రెస్‌ ఆడుతున్న హైడ్రామా?

దీన్ని ఖండించాలి, గొంతులు లేపాలి. మాట్లాడాలి, అరవాలి. అరచి గగ్గోలుపెట్టాలి.
 
ఇన్ని అబద్ధాలు, దొంగ నాటకాలు కళ్ళముందు కనబడుతున్నా మాట్లాడరేం? నాలాగే మీక్కూడా కడుపు రగులుతుంటుంటే మాట్లాడండిరా బాబూ!

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి