ఆదివారం 4 సెప్టెంబర్ 2011

లా‌ థింకర్లు !!!!

లాజికల్‌ థింకర్లు, లా పాయింట్‌ థింకర్లు .. .. లావిష్‌ థింకర్లు .లావారిష్‌ థింకర్లు

ఓ యాభై సంవత్సరాలు ముందు మా తాతయ్య విశాఖపట్నం సీతమ్మధార లో మూడు రూపాయిలిచ్చి ఓ 500 గజాల స్థలం కొన్నాడు. వారసత్వంగా నాకొచ్చింది కనుక 2011 లో నా ఆస్తి మూడు రూపాయిలు మాత్రమే ..

అట్టెట్టయ్యిద్దా? అదంతే...... జాగర్త లాజికల్‌ థింకర్లుంటారు, వాళ్ళ లాజిక్‌ అర్ధం కాని పతోడూ లేటరల్‌ థింకరో మరోటో అయిపోతాడు.

నాయల్ది, ఇంతకన్నా జోకింకోటుందా? 1990 లో 23 లచ్చలకి జూబిలీ హిల్స్‌ లో వెయ్యి చదరపుగజాల ఇల్లుకొన్నాడంట, కాబట్టి 2011 లో దాని విలువ 23 లచ్చలేనంట.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి