2004లో జీవితంలో మొదటిసారి బెంగళూరు వచ్చి మేఖ్రీ సర్కిల్ లో వొల్వో బస్సుదిగా. దిగీ దిగంగానే కళ్ళముందు రోడ్డుకవతల కనిపించిన "XXX తాంత్రిక విద్యాలయ అని" బోర్డు జదివి ఓర్నాయనో.. ఈ వూళ్ళో తంత్రాలకి కాలేజిలుంటాయా ఏందని బయ్యం బుట్టి సచ్చా... ............పక్కనే అదే కాలేజి పేరు ఇంగిలీసులోXXX Engineering College అనిగాని కనిపించకపోయుంటేనా . నాయాల్ది అట్నించటే మావూరుతిరిగిపోయే వాణ్ణి ....
మన వూరూ ఉంది ఎందుకు .. "తాంత్రిక విద్యాలయ అంటే ఇంజినీరింగ్ కాలేజి అని తెలియజెప్పే తలకిమాసినోడు లేడు, తెలుసుకోవాలనుకునే తలకిమెరిసినోడూ లేడు."
ఈ సుత్తి ఎందుకుజెప్పానంటే .. నిన్న నెట్ లో ఏదో వెతుకుతూ వెతుకుతూ మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (విశ్వవిద్యాలయం) వెబ్ సైట్ చూడాల్సొచ్చింది.. నాయాల్ది .. ఇమేజ్ రూపంలో ఉండడం మూలాన మార్చటానిక్కుదరని రెండు బొమ్మలు మినహా ..మొత్తం అంతా ఇంగ్లీషే...

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి