మంగళవారం 5 జూలై 2011

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఒక్క మగాడు కావాల్రా !!! (సీ ఎం కిరణ్‌ బాబుకి ప్రత్యేకం)

"తెలంగాణ బంద్‌ తో డిపోలకే పరిమితమైన బస్సులు, సికిందరాబాద్‌ స్టేషన్‌ లో సిటీ బస్సులు దొరక్క ప్రయాణీకుల అవస్థలు. ప్రయాణీకులని దోచేస్తున్న ఆటోవాలాలు-  ఈరోజు ఉదయం 9.45 కు @ TV 9

కట్‌ చేస్తే !!!

రెండు సెకండ్ల తర్వాత అక్కడున్న ఓ ప్రయాణీకుడితో ప్రత్యేక ఇంటర్వ్యూ ..
రిపోర్టర్‌ - బంద్‌ మూలంగా బస్సులు లేకపోవడం మూలాన మీకు ఎదురయ్యే ఇబ్బందులేంటి?
ప్రయాణీకుడు - ఒక్క బస్సులేదు ఆటో లేదు, ఊరినించి తెచ్చిన వర్కర్లు అక్కడపడి ఏడుస్తున్నారు, అయ్యా కోదండరాం గారూ, కేసీ ఆర్‌ గారూ .. మీరు పెద్దలు మా బాధలు అర్ధం చేసుకోండయ్యా .. మీరు మీ హక్కులకోసం పోరాడండి అయ్యా కానీ కొంచెం బస్సులనైనా తిరగనీయండయ్యా .. మీకు పుణ్యం ఉంటుంది అయ్యా అర్ధం చేసుకోండి ..

సిగ్గొస్తుందిరా భై ..

చీ . థూ .. ఏమయిపోతోందిరా మారాష్ట్రానికి, మా ఊరికి. ఈ కేసీ ఆర్‌ ఎవడు, కోదండరాం ఎవడు, బస్సులు తిరిగడానికి వీళ్ళని బతిమిలాడడం ఏంటి రా .. ప్రభుత్వం సొమ్ముతో, ప్రభుత్వం పెట్రోల్‌ తో ప్రభుత్వోద్యోగులు నడిపితే నడిచే బస్సులు తిరగాలంటే ఎవణ్ణో బతిమిలాడుకోవాలారా?? ఏమయిఫొయిందిరా ప్రభుత్వం? ఎవణ్ణి పరిపాలించేందుకురా ప్రభుత్వం .. వీవీధికుక్కల కాట్లకి రేబిస్‌ రాకుండా .. ఊరపందుల మూలాన స్వైన్‌ ఫ్లూ లు రాకుండా నివారణా చర్యలుచేపట్టడానికా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కి ఒక్క మగాడు కావాల్రా .. ఒక్క మగాడు.. థూ నా బొడ్డు . ఏందిరా నువ్వు బందులు చేసేది .. చేసింది చాలు ఇంక ఆపు .. నా ప్రజలురా వీళ్ళంతా .. నా మనుషుల్రా ?? నువ్వెడివిరా వీళ్ళని ఇబ్బందులు పెట్టడానికి అని గద్దించి గదమాయించగల ఒక్క మగాడు కావాల్రా ...

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి