ఆదివారం 8 మే 2011

జగనన్నా నీ వెంటే నేను !!

సెప్టెంబరు 2009 లగాయితు నువ్వుపడిన కష్టాలు, నీ మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు యావత్బారద్దేశం కళ్ళారాజూసింది. నిన్నూ మా రాజన్ననీ ఎలాగైనా తొక్కేయాలని ఎన్ని శక్తులు యేకమైనా నువ్వు జూపించిన తెగువ, దమ్ము, ఒంటిచేత్తో నెట్టుకొచ్చిన తీరు పిల్లకాయలందరికీ స్ఫూర్తిదాయకం.
యెండనక వాననక జనాల్లోబడి, రోడ్లల్లోబడి, పాకల్లోబడి, పెంకుటిళ్ళల్లో బడి నువ్వుబడిన శ్రమ, నువ్వు తిరిగిన పాటు వృధాపోదుగాక పోదు. చీమల్దండు మాదిరి యావత్‌ జగన్‌ యువసైన్యం నీకు అండగా ఉంటే నువ్వెందుకుతగ్గాలన్నా?


నువ్వు పడినా లేచినా నీయెనకే నేను

నువ్వు ఓడినా గెలిచినా నీ యెనకే నేను..

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి