గురువారం 16 డిసెంబర్ 2010

జగనన్నకి జై !!

ముప్పై యేళ్ళ చంద్రబాబు రాజకీయశెరిత్రలో, ముసలోడికి గోచీ ఊడాలి అని రోశితాతని తిట్టడం, వోలీబాబా, నాలుగు డజన్ల దొంగలు అని రాజన్నని తిట్టడం తప్ప, ఏనాడూ సోనియమ్మని పన్నెత్తి ఒక్క మాటనే ధైర్యమే లేకపాయె. ఆ ధైర్యం ఉన్న ఒక్క మగాడు మా జగనన్న.

మామూలోడికి ధైర్యం ఉంటే అట్టాగా అనుకోవచ్చు, అన్ని అవినీతి, దోపిడీ అక్రమ ఆస్తుల ఆరోపణలున్నా ఇంతగా తెగించి కన్నుకి కన్ను కాలుకి కాలు తీస్తూ ముందుకి దూసుకుపోతున్న జగనన్న పేరు చెప్తే ఉప్పొంగని తెలుగోడి గుండె ఉందా? మురిసిపోని మనసుందా? మరగని రక్తపు బొట్టుందా?

మంచిపని జేశావు, నాయాల్ది, ఇప్పుడింక జనాలమధ్యకి బోవడానికి డిల్లీ ఓళ్ళ అనుమతులక్కర్లేదు, వీహెచ్‌, కేకేల ఎక్కిరింతల్లేవు, సత్తిసర్వేబాబు ,  సత్తిబొత్సాబాబుల జనగోషల్లేవు. రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా ఊళ్ళూబట్టుకుని మీ నాన్నమాదిరి నువ్వు తిరగడం, నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి దొబ్బలేని పెతీ తలకిమాసునోడు మా సోనియమ్మ, మా ఇందిరమ్మ మా రావులు బాబుల మూలంగానే గెలిశాం అని సంకలుగుద్దడం.

నీ తెగింపు మూలంగా నువ్వు ఎండనకా వాననకా తిరిగి తిరిగి నడిపిస్తున్న ప్రతీ నిముషం నీ సొంతం, ప్రతీ మాట నీ మాట, నీ ఎనక నడిసే ప్రతీ ఒక్కడూ నీ సొంత మనిషి- ప్రతీ గెలుపూ నీ సొంత గెలుపు, ప్రతి దెబ్బా గుండెల మీద తగిలే ఎదురుదెబ్బ.

సాగిపో మరి, ఓడినా గెలిసినా నాదే బాధ్యత అని ఆడినప్పుడే, ఆటలో అసలైన మజా వొచ్చిద్ది. శెబాశ్‌

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి