మంగళవారం 9 నవంబర్ 2010

బ్లాగు బాబ్జి ఫార్ములా ..

ఆలోసించగా సించగా సించగా ఓ అవిడియా తట్టింది.

స్టీవీ9 రజనీకాంత్ మాదిర్లో ఎప్పుడుజూసినా పళ్ళికిలించాలనిపించేంత నిచ్చనూతనంగా బలాగుల్ని, రెక్కాడితేగాని డొక్కాడని మన కార్పొరేట్ కష్టజీవితాన్ని తేడా రాకుండా ఎలా మైంటింగు జేయాలా అని ...

పారెటో రూల్ (80-20) గురుతుండాదా లేదా?- 80% of activities result in 20% of productivity and 20% of activities for 80% of productivity.. పొద్దున్లెగిస్తే మన జేసే పతి వంద పనుల్లో పనికొచ్చే పన్లు 20 అయితే పనికిమాలిన పనులు 80 ఉండాయంట.

అదేమాదిర్లో- ఏదో మనకి దెలిసింది అందరికీ జెవుదాం అని బలాగుల్లోకొస్తే! బలాగుల్రాయడానికి 20% టైంబడితే, ఎవుడెవడో అగినాతలు రాసే చేసే యదవ కామెంట్లు జదవడానికి 80% టైము బడతందాయె.

అందుకే, ఈ రోజునించి డిసైడ్ అయ్యా—

బలాగుల్రాసుకుని 80% ఆనందాన్నీ, మిడ్ నైట్ మసాలాలో ముమాయిత్ ఖానున్జూసుకుని మిగతా 20% ఆనందాన్నీ ఎవుడాపినా ఆగకుండా సొంతంజేసుకోవాలని.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి