బుధవారం 24 నవంబర్ 2010

రోశి 'పెదరాయుడు' తాత

వరదలొచ్చి జనాలు రోడ్డునబడితే నేను దారినపోయే దానయ్యనంటివి,

ఉసమానియా పిల్లకాయలు ఎమ్మటబడి కనిపించినోణ్ణల్లా కొడితాంటే నేను పొరపాటునో గరహపాటునో ముక్యమంత్రి నయ్యా అంటివి

ఊరపందులమాదిరి జనాలని మైకురో పైనాన్సోళ్ళు దోచకబోతంటే నేను నిమిత్తమాత్రుణ్ణి అంటివి

ఎవుడో దిక్కూ దివాణంలేనోడు సోనియమ్మ పేరుకి శిటికెడు మసిబూస్తే మటుక్కు జెండా చేతిబట్టి గోసీ బిగించి కట్టి ముక్కునిండా నశ్యం దట్టించి రోడ్డెక్కివు

నాయాల్ది నీ స్వామిబక్తి ముందు నియమాలూ, నిబందనలూ బలాదూరైపోలా

పోన్లే ఏదయితేనే, పెదరాయుడు సినిమాలో మోహన్‌ బాబు మాదిరి జీవితంలో సూడలేననుకున్న ఇసయం ఒకటిజూశా ..వయోబారంతో దిగిపోతండావని జీవితంలో ఇనలేననుకున్న ఇసయం ఒకటి ఇన్నా-
 
ఏదయితే అదయినాది- నీ మిగిలిన జీవితం సంతోసంగా మనవలూ మనవరాళ్ళతో ఆనందంగా గడపాలని, నీకు ఇష్టమైన పనులని నీకు నచ్చే విధంగా జేసుకోడానికి ఆ భగవంతుడు నీకు ఆశీశ్శులు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి