బానేవుంది !!!
మనోడు కుమ్మేశేడు. తెలుగుజాతి గర్వించదగిన గాన గాంధర్వుడిగా సెరిత్రలో నిలిసిపోతాడు. తెలుగు వాడి గొంతులో ఎంత పవరుందో ఇయ్యాల ప్రపంచం మొత్తం జూసింది. అందులో ఏ సందేహం లేదు. ఈ బ్లాగు బాబ్జి తరపున శంకరగిరి అడవుల్లోని పాము పుట్ర నక్క, జింకా మన్నూ మశాణం వగైరా అన్నిటి తరపున శ్రీరాం బాబుకి హృదయపూర్వక అభినందనలు, లంగిడీలు.
అయితే ఇక్కడ ఎంత వొద్దనుకున్నా నా అడివిబుర్రకి ఒక యదవాలొసన వత్తాంది. మనోడికి ఎన్ని వోట్లొచాయి- ఈ లంకె ప్రకారం - అక్షరాలా నాలుగు లక్షల అరవై రెండువేల రెండువందల యాభయి ఒకటి. మరి పంపి సెల్ ఫోను కంపెనీలోళ్ళు SMS లు బట్వాడాజేసే దేశసేవేం జేయట్లేదుగా- ఆ లెక్కన SMS కి మూడు రూపాయలేసుకున్నా - 13,86, 753 రూపాయలు. ఆపైన సర్వీసు టాక్షింగ్ లూ అవీ గలిస్తే 15 లక్షల యాబయివేల పైమాటే.
మనొణ్ది పక్కనెడితే మిగతా ఇద్దరికీ కలిపి 304674 SMS లు వచ్చాయి. ఆ లెక్కన ముగ్గురికీ గలిపి పోటీలుపడి మరీ మనోళ్ళు SMS లు బంపించడానికైన ఖర్చు అక్షరాల 25 లక్షల 76 వేల 868 రూపాయిలు.
ఐదరాబాదు లో స్ఫూర్తి పౌండేషను అనే బళ్ళో 97 మంది అనాధ పిల్లకాయలు సదువుకుంటన్నారు. వాళ్ళకి సదువుకీ, పుస్తకాలకీ, పెన్నులకీ, చొక్కాలకీ నిక్కర్లకీ కలిపి సంవత్సరం మొత్తానికీ అయ్యెఖర్సు ఇదిగో ఈ లంకె జెప్పిన ప్రకారంగా 769630 రూపాయిలు. అంటే ఇంచుమించు ఆ SMS లు పంపించడం మానేసి పంపించిన పెతీ తలకిమాసినోడు అదే మూడు రూపాయిలో చిల్లరో ఏ పిల్లకాయలని చదివించే సంస్థకన్నా ఇచ్చుంటే ఇంచుమించు ఓ వందమంది పిల్లకాయలు కనీసం నాలుగేళ్ళు సంతోషంగా చదువుకునేవాళ్ళు గందా.
అయితే ఒకటి .. తలకిమాసిన పెతీఒక్కడూ పంపించటం మానేస్తే మరి ఎవడు గెలిచాడో ఎలా తెలుస్తదని? మరి అందుకేగా .. ఆ స్టేజీమీద మనకన్నా పెద్ద తలకిమాసినోళ్ళు, బతికిసెడినోళ్ళు గుడ్లగూబల్లెక్కన గూర్చున్నారు.