చెప్పినట్టుగానే వొచ్చా,
నన్నెవరన్నా గురుతుబడతారేమొనని జూశా ! లేదు ..
కనీసం ఎవడైనా తెలంగాణ పోరాటయోధుడు దారిలో గనిపిస్తే- నీ వూరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అని బాలయ్యబాబు మాదిర్లో తొడగొడదామని జూశా .. వార్నీయవ్వ ఒక్కడుగనిపిస్తే ఒట్టుగా ...
ఈ మధ్య అడవుల్లోంచి పులులూ ఎలుగ్గొడ్డులూ వూళ్ళల్లో బడిదిరుగుతున్నాయంటగా .. ఎలుగ్గొడ్డు ఎక్కడన్న గనిపిస్తదేమో దానిక్కూర్చోబెట్టి కటింగ్ జేయిద్దాం అనుకున్నా .. నాయాల్ది , నేనొస్తున్నాననిదెలిసి అవి జాగరత్త బడ్డట్టున్నాయి..
ఏందో పెద్దాయన ప్రతిగన అంట జదివించాడు, నాకు ఒక్కముక్క నోరుదిరిగితే ఒట్టు, మళ్ళి ఒకటి పలకక ఒకటంటే ఆ పెద్దాయనకెక్కడకోపమొచ్చుద్దో.. మళ్ళీ ఎక్కడ నా చెవులుమొలేసి తెలుగుతల్లిగడుపున సెడబుట్టావు అడివినాయలా. అంటాడేమో ఎందుకొచ్చిందిలే అని బబ్బులిక్కం నముల్తా షోయింగిచ్చా..
అందరూ ఒకళ్ళొనొకళ్ళు అడుక్కుంటన్నారు బ్లాగు బాబ్జి నువ్వేనా నువ్వేనా అని.. నేను ఓరశెవిన యినుకుంటా ముసి ముసినవ్వులు నవ్వుకున్నా ..
ఈళ్ళేందో ఆరంభశురుల మాదిరి నడుద్దాం నడుద్దాం అంటారు. తీరా నడక మొదలెట్టాక ఆగుదాం ఆగుదాం అంటారు. నడుస్తూ ఆగుతూ ఆగుతూ నడుస్తూ సివారాకరికొచ్చేసరికి సగం మంది ఏడ మాయమయ్యరో తెలియకుండబోయింది.
అంతా అయినాక పీవీ గజాన భూమికాడ నుంచుని "జాయ్ తెలుగుతల్లి… జాయ్ సమైక్యాంధ్రా" అని మా అరకు కిరండోల్ పాసింజరు రైలుబండి కూతకన్న గట్టిగ ఆరిశా ..