గురువారం 12 ఆగస్టు 2010

వామ్మో! 5 రోజుల్లో 1000 మంది విజిటర్సురో

వార్నీయవ్వ ..బ్లాగు పెట్టి నిండా 5 రోజులు గూడ గాలా అప్పుడే 1000 మంది వచ్చి తొంగి చూసి పోయుండ్లా? ఎట్టా? ఏదో నాలుగు మంచిమాటలు అందరికీజెప్పిపోదామని నేననుకుంటే నన్నిట్లా పనిగట్టుకుని పాపులేరింగ్‌ జేసేస్తున్నారేంది?

అంచేత.. ఆ పళంగా .. కూడలి వీవెన్‌ గారికి, మాలిక ఏకలింగం గారికి, హారం (భరారే అనుకుంటా) గారికి చాలా టాంక్సు. పనిలోపని, వీడేంది అనామకుడు అని జూడకుండా నా బ్లాగులో మొదటికామెంటు రాసిన దుర్గేశ్వర గారికీ టాంక్సు మీద టాంక్సు ..

రికార్డ్లు సృష్టించినా మేమే ..తిరగరాసినా మేమే గందా .. .దటీజ్‌ బాబ్జి ..బ్లాగు బాబ్జి.. అందితే బ్లేడు అందకపోతే బ్లాగు ..