బుధవారం 15 ఫిబ్రవరి 2012

ఎడారివర్షం బృందానికి అభినందనలు !!!

కేరళ ఫిలిం ఫెస్టివల్‌ లో ప్రదర్శించబడడానికి ఎడారి వర్షం సినిమా ఎంపికయింది అని తెలిసి చాలా సంతొషిస్తున్నాను. ఆ సినిమా నేను చూడలేదు కానీ, ఆ సినిమా దర్శకుడు మన సాటి బ్లాగరు "కత్తి మహేష్‌" కి నా అభినందనలు. మహా మహా దర్శకులే చేయలేని పనిని కేవలం కొంతమంది ఔత్సాహికులు చేయగలగడం అంటే మామూలు విషయం కాదు.

సినిమామీద, వ్యాపారం మీద ఆసక్తి ప్రతీ ఒక్కడికీ ఉంటుంది. కానీ వాటిలో తలబడి గెలవడం చాలా కొద్దిమందికే సాధ్యం. నిజంగా చేసి చూపించిన ఎడారివర్షం ఔత్సాహిక బృందానికి అభినందనలు ..కుడోస్‌, అప్లాడ్స్‌, చప్పట్లు ..

కత్తి అన్నాయ్‌, మీద నాకు ఎప్పుడూ ఒక నమ్మకం ఉంటుంది. అన్నాయ్‌ వాదనలతో నేను ఏకిభవిస్తానా లేదా అన్న విషయం పక్కనపెడితే, నమ్మిన సిద్ధాంతాలమీద పట్టుతో, సంకల్పంతో, మంచి విషయపరిఙ్ఞానంతో అన్నాయ్‌ చేసే వాదనలు నాకు చాలా ముచ్చటగొల్పుతాయి.

మన ఆసక్తులమీద ఫోకస్‌ కోల్ఫొకుండా లక్ష్యం మీద దృష్టిపెట్టి ముందుకుపోతే ఎలా గెలవగలమో అద్భుతంగా ఋజువు చేశావు. నీ కృషి కి హేట్స్‌ ఆఫ్‌...... హైల్‌ యూ .. హైల్‌ యూ మేట్‌ .. కీప్‌ ఇట్‌ అప్‌..

ఆదివారం 8 జనవరి 2012

సలహా కావాలి !!!

మా ఫ్రెండు ఒకడు రెండేళ్ళముందు కొని మంచి కండిషన్‌ లో ఉంచిన సెకండు హాండు బీ ఎం డబ్ల్యూ సెడాన్‌ కారు కొనడం బెస్టా?
లేక కొత్త ప్రత్యేకమైన ఆఫర్లో 50 వేలు తక్కువకి దొరుకుతున్న హోండా సీ ఆర్‌ వీ కొనడం బెస్టా?

హొండా CRV లో ..ఇదివరకెప్పుడో ఇంజిన్‌ లోపాలు వచ్చి కార్లన్నీ రీకాల్‌ చేశారు అన్నమాట నిజమా? ఆన్‌ రోడ్‌ పర్ఫార్మెన్స్‌ ఎలా ఉంటుంది? సర్వీస్‌ ఎలా ఉంది? రోడ్‌ అసిస్టెన్స్‌ ఎలా ఉంది? ఎవరైనా వాడుతుంటే నాకు కొంచెం సలహా చెప్పగలరా?

ఆదివారం 11 డిసెంబర్ 2011

పంజా - బ్లాగు బాబ్జి రివ్యూ

రేటింగ్‌: 3.25/5

పెద్ద అద్భుతంగా అయితే లేదుగాని బాగానే ఉంది. కధ పాతదే అయినా డైరెక్టరు టేకింగ్‌ కొత్తగా బాగా ఉంది. చాలా నీట్‌ గా ఉంది సినిమా అంతా, ఫొటోగ్రఫీ అదిరిపోయింది, పాటలు వరైటీగా బాగున్నాయి. చాలా స్టైలిష్‌ గా ఉంది.నాకు బాగా నచ్చింది సినిమా

హైలైట్స్‌:
ముఖ్యంగా --యువాన్‌ శంకర్‌ రాజా బాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ .. యిరగదీసింది, అసలు మ్యూజిక్కే ఈ సినిమాకి హీరో అనచ్చు
పవన్‌ కళ్యాణ్‌ స్టైలు, లొకేషన్లు ఫొటోగ్రఫీ
కలకత్తాలో బ్లాక్‌ స్క్వేర్‌ (అతుల్‌ కులకర్ణి) డెన్‌ సెట్టింగ్‌, ఫైట్‌ టేకింగ్

డ్రాబాక్స్‌:
హీరోయిన్లు-- ఎవడు ఎక్కణ్ణించీ పట్టుకొచ్చాడో గానీ.. వాడికి సన్మానం చేయాలి గురూ !!!
ఆలీ, సుబ్బరాజు లని సరిగ్గా వాడుకోలేదు, ఝాన్సీ తో పనికిమాలిన ఓవరేక్షన్‌ కామెడీ తీసారు, ఈ కారెక్టర్‌ ని తీసిపాడేస్తే ఇంకోసారి చూస్తాను
తనికెళ్ళ భరణితో " ఆ ఆఫరు జై కేనా? మాక్కూడా ఉందా" అన్న ఫోన్‌ కాల్‌ సీను చివర్లో పెట్టి ఉండాల్సింది, ముందే చెప్పేయడం వల్ల సస్పెన్స్‌ క్రియేట్‌ కాలేదు, తెలియకపోతే థ్రిల్‌ వచ్చేది.

నాకు నచ్చిన కొన్ని సీన్ల గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా....
పవన్‌ కళ్యాన్‌ చెప్పులు విడిచి పరిగెత్తే సీన్‌ కదిలించేసింది, పరిగెత్తడం కాసేపు చూపిస్తే బాగుండేది
క్లైమాక్స్‌ ఫైట్‌ లో ..అతుల్‌ కులకర్ణి పవన్‌ కళ్యాణ్‌ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్న వెంటనే ఒక ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చుకుంటారు చాలా బాగుంది ..
క్లైమాక్స్‌ సీన్‌ లో .. పదిమంది పవన్‌ కి తుపాకీ గురిపెట్టి .. గన్ను కిందపడేయ్‌ జై అంటే .. మనోడు ఒక్క లుక్కిచ్చి గన్ను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు .. ఆ సీన్‌ అదిరిపోయింది.

ఈ సినిమాలో గనక, త్రివిక్రం శ్రీనివాస్‌ తో సంభాషణలు రాయించి, ఫస్ట్‌ హాఫ్‌ లో లవ్‌ స్టొరీ నిడివి కొంచెం తగ్గించి, మున్నా గాడితో ఇంకొన్ని యదవపన్లు, బ్రహ్మానందం తో ఇంకో రెండు మూడు అఘాయిత్యాలు చేయించి, ఆలీ సుబ్బరాజులని బాగా ఉపయోగించుకుని, ఝాన్సీ కారెక్టరు లేకుండా ఉండి ఉంటే ..మంచి టాక్‌ వచ్చేది

ఆదివారం 27 నవంబర్ 2011

ప్రపంచంలో ఎవరిమీదా పరిమితిలేని ప్రేమలు పెంచుకోకూడదు ..

స్వభావానికి విరుద్ధంగా ఇవాళ నాకో విషయం చెప్పాలనిపిస్తోంది.

ప్రపంచంలో ఎవరిమీదా ప్రేమలు పెంచుకోకూడదు. తల్లిదండ్రులమీదనైనా, పిల్లలమీదైనా, గర్ల్‌ ఫ్రెండులమీదైనా ..

వాళ్ళు మనజీవితంలోకి వచ్చాకా మనమున్నాము, వెళ్ళిపోయాకా ఉంటాము. ఈ మధ్యలో ఏదో వాళ్ళులేకపోతే జీవితమేలేదనుకుని జనాలు ఎందుకు వాళ్ళవెనకాలే వెళ్ళిపోతారో నాకు అర్ధం కాదు.

అలాగని అందర్నీ భవబంధాలకి దూరంగా ఈ బలాగు బాబ్జీగాడిలాగా బతకమని కాదు. కొన్ని బంధాలు అంతే అవిలేకపోతే మనం లేము అనిపిస్తాయి, మా గురువుగారు చెప్పేవాళ్ళు. మనకి క్రితం జన్మలో ఋణం ఉంటే ఈజన్మలో కలుస్తాం, ఆ ఋణం తీరిపోయాక విడిపోతాము. ఆపేశక్తిలేదు ఎవరికీ లేదంట. అలాంటిది ఏమన్నా మీకు ఉంటే వెంటనే దాన్నించి దూరం జరగండి. తరవాత ఇబ్బంది పడతారు.

బ్రమ్మ రాసిన రాతలకి ఎదురు రాయాలనుకోవడం మూర్ఖత్వం బాస్ . మనుషుల్లో పెరుగుతున్న ఈ మూర్ఖత్వం నాకు భయం కలిగిస్తోంది. చదువుకున్నవాళ్ళుకూడా .. అంత మూర్ఖంగా .. ఏంటో ..ప్చ్

అందుకే ఇలాంటి కష్టపరిస్థితులకి ఎదురీది బతకడం ఎలాగ అన్నదానికోసం నా అంతట నేనుగా ఒక ఫార్ములా తయారు చేసుకున్నా .. అది నా వ్యక్తిగతం అయినా దానివల్ల పదిమందికి ఉపయోగం కలుగుతుంది అని నాకు అనిపిస్తోంది.
అఫ్కోర్స్ అదేమీ అంత గొప్పవిషయం కాదనుకో .. చాగంటి మాస్టారు ప్రవచనాలు విన్నవాళ్ళకెవరికైనా తెలిసిపోతుంది.

అదేంటో తర్వాతచెప్తా ..

శనివారం 26 నవంబర్ 2011

బెంగుళూరు జీవితం-2, పబ్బులూ ఫుడ్డూ !!!

శుక్రవారం 5 కొట్టడంతో వీకెండ్‌ మొదలైపోతుంది. ముందు జనాలందరం గుమిగూడి వెళ్ళేది ఎక్కడికా అని డిసైడ్‌ జేస్తాం. సాధారణంగా మా దుకాణం ఎంజీ రోడ్దులో హార్డ్‌ రాక్‌ కేఫ్‌ లోనో, ఫోరం మాల్‌ సెకండ్‌ ఫ్లోర్‌ లో ఫిరంగీపానీ లోనో. అలా లేదంటే శనివారం పొద్దున్న 5.30 కి నిద్రలేచి చలో పాండిచ్చేరి...

పబ్బుల్లో బ్రిగేడ్‌ రోడ్డులోని గజ్లర్స్‌ పబ్బు, ఇంకా హోసూర్‌ రోడ్డు వైపున్న ఫోరం మాల్‌ గేటు ఎదురుగా బ్లూ హెవెనో ఏదో (పేరు గుర్తు లేదు) పబ్బు కూడా చాలా బాగుంటుంది, మైల్డ్‌ మ్యూజిక్‌ ఇష్టపడేవాళ్ళు అక్కడినుంచీ కదలరు. అమీబా లో బౌలింగ్‌, మైన్‌ లాండ్‌ చైనా, నందినీ లో చారు టేస్టూ నా ఫేవరెట్లు.

జయానగర్‌ 4త్‌ బ్లాక్‌ లో 'మయ్యాస్‌' అని ఒక హోటల్‌ లో ఫుడ్డు భలే బాగుంటుంది, చాలా శుభ్రంగా, సౌకర్యంగా ఉండే మూడంతస్థులశాకాహార రెస్టారెంట్‌, అలాగని రేట్లు ఎక్కువా అంటే అదీలేదు 200 రూపాయల్లో బ్రహ్మాడమైన భోజనం దొరుకుతుంది, 50 రూపాయల్లో వేడి వేడి మినీ మీల్స్‌ పార్సిల్‌ దొరుకుతుంది. టిఫ్ఫిన్లు పెద్దగా బాగోవు కానీ, కాఫీ మాత్రం అదుర్స్‌. ఘుమ ఘుమలాడే కాఫీ కౌంటర్‌ ముందు ఎప్పుడూ ఓ 20 మంది క్యూ. ఒక్కటే గొడవ ఏంటంటే వీకెండ్స్లో నాలాంటి బెమ్మీగాళ్ళకి అతికష్టమ్మీద గానీ టేబిల్‌ దొరకదు.ఫేమిలీస్‌ కి కావాలని నిర్దాక్షిణ్యంగా బైటికి గెంటేస్తారు. ఆదివారం 7 కొట్టంగానే అడయార్‌ ఆనందభవన్‌ లో వేడి వేడి పొంగల్‌, మయాస్‌ కాఫీ .. కెవ్వు కేక

టిఫిన్లు కోసం అయితే బసవనగూడిలోలో 'థిండీస్‌ ' అని ఒక హోటల్‌ భలే ఉంటుంది. చాలా పోలిష్‌డ్‌ గా ఉంటుంది, అయినా చాలా ట్రెడీషనల్‌ గా ఉంటుంది, ఒక కుటుంబం మనకి ఆతిధ్యం ఇచ్చినట్లు ఉంటుంది, నా ఫేవరెట్‌ అయితే ఇడ్లీ సాంబార్‌. ఇంటికి బయల్దేరి ట్రైన్‌ ఎక్కేముందు ఓ 200 పెట్టి ఓ బాగునిండా థిండీస్‌ లో టిఫిన్లు పార్సిల్‌ చేయిందుకుని ఎక్కితే వైజాగ్‌ వెళ్ళేలోపు సరిపోతాయి. అస్సలు లీక్‌ అవ్వకుండా, ప్రయాణాలకి అనుగుణంగా పాక్‌ చేయడం థిండీస్‌ స్పెషాలిటీ.

మయ్యాస్‌ లో అయినా, థిండీస్‌ లో అయినా ఆ షాపు ఓనర్లని చూస్తే ఎందుకో గౌరవం వస్తుంది. నేను 2005 మొదలుగా ఇంచుమించి నెలకి ఓ 10 సార్లు మయ్యాస్‌ కి వెళ్తాను, ఐదారుసార్లు సార్లు థిండీస్‌ కి వెళ్తాను. మొదట్లో నాకు పార్సిల్‌ లేట్‌ అయితే కోపం వచ్చేది, సీరియస్‌ అయ్యేవాణ్ణి, అయినా ఈరోజుదాకా మయ్యాస్‌ లో అయినా థిండీస్‌ లో అయినా కౌంటర్లోని మనుషుల మొహంలో చిరునవ్వు తప్ప వేరేది చూళ్ళేదు. చాలా ఒద్దికగా, సాంప్రదాయకమైన తమిళియన్‌ బ్రాహ్మిన్‌ ఆతిధ్యమూ, వంటకాలూ చాలా అద్భుతంగా ఉంటాయి.
 
కాబట్టి ఈసారి బెంగుళూరు వస్తే మయ్యాస్‌ లో భోజనమూ, థిండీస్‌ లో టిఫినూ తినకుండా వెళ్ళకండి, తెలియకపోతే బాబ్జీ గాడికో ఫోన్‌ కొడితే దగ్గరుండి తీస్కెళ్ళి తీసుకొస్తాడు, మరి బిల్లు మాత్రం మీరే కట్టాల.. కికికికి..

మంగళవారం 15 నవంబర్ 2011

నాలుగున్నర కోట్ల కాలిఫ్లవరు పూలు కావలెను!!

నాలుగున్నర కోట్ల మనోబావాలు, 700 బిడ్డల బలిదానాలు, ఆరు దషాబ్దాల వుజ్జమం,  ప్రపంచ షరిత్రలో లేని యిధంగా 150 రాజీనామాలు, లచ్చల ఎకరాల ఆత్మగౌరవాలు, డిల్లీ నుంచీ గల్లీదాకా మార్మోగుతున్న షబ్దం, పెండలెక్కున్న బిరియానీ, బర్రె గొంతేసుకున్న బాలసుబ్బ్రమణ్యం, డిసెంబరు 31 తర్వాత బూకంపం, రెండువారాల్లో రాబొతున్నపెకటన, అంతర్యుద్ధం, పెళయం, లేచి నిలవడి రోడ్డుమీదకొచ్చిన పౌరుసం, ధూం ధాం, అలయ్‌ బలయ్‌, వంటావార్పూ, మాటా ముచ్చటా, మన్నూ మశాణం, కేసీఆరూ కేటీఆరూ---- తర్వాత జరిగేపరిణామాలకి బాధ్యత వహించాల్సిన చిదంబరం,

ఈ వార్త చదివి ఏమంటారో తెలుసుకోవాలనుంది.

ఫార్మేట్ లో లేని రాజీనామాపత్రాలు

న్యూఢిల్లీ: తెలంగాణ ఎంపిల రాజీనామా పత్రాలు తగిన ఫార్మేట్ లో లేనందునే ఆమోదించలేదని లోక్ సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత కొందరు పార్లమెంటు కమిటీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రశ్నలు కూడా అడిగారు. కమిటీల తరపున విదేశాలలో పర్యటించారు. పార్లమెంటు రిజిస్టర్లో సంతకాలు చేశారు. రాజీనామా చేయాలన్న దృఢమైన సంకల్పం వారికి లేదని భావించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ 242 నిబంధన ప్రకారం 12 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదని ఆ వర్గాలు తెలిపాయి.